అమరాతి : మాజీ ముఖ్యమంత్రి , టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ( Chandra Babu ) పై సీఐడీ మరో పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ (Skill Development Case) స్కీం కేసులో అవినీతి ఆరోపణలపై 14 రోజుల పాటు ఏసీబీ కోర్టు రిమాండ్(Remand) విధించింది. ఇదిలా ఉండగా సోమవారం సీఐడీ చంద్రబాబుపై విజయవాడ ఏసీబీ కోర్టు (ACB Court ) లో మరో పిటిషన్ దాఖలు చేసింది.
అమరావతి అవుటర్ రింగ్‌రోడ్ కేసులో పీటీ వారెంట్ పిటిషన్ వేసింది.స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డారంటూ నమోదు చేసిన కేసులో కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీబీఐ మరో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. కాగా చంద్రబాబుకు హౌస్ కస్టడీ (House Custody) కి అనుమతించాలని వేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది.
ఈ సందర్భంగా సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఆర్థిక నేరాల్లో సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉండడం వల్ల చంద్రబాబుకు హౌస్ కట్టడీకి అనుమతించవద్దని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. ఇంట్లో కన్నా జైల్లోనే సెక్యూరిటీ ఉంటుందని, జైల్లో పూర్తిస్థాయి భద్రత కల్పించామని ఆయన వాదించారు. జైల్లో 24 గంటలూ పోలీసులు విధుల్లోనే ఉంటారని ఆయన తెలిపారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే వైద్య సదుపాయం కూడా ఏర్పాటు చేశామని వెల్లడించారు.