అమరావతి : రాష్ట్రంలో హత్యా రాజకీయాలు జరుగుతున్నాయని జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఏపీ మంత్రులు(AP Ministers) బీసీ జనార్ధన్ రెడ్డి(Janardhan Reddy), ఎన్ఎండీ ఫరూక్(Farooq) ఆరోపించారు. శుక్రవారం వారు మీడియాతో మాట్లాడారు. ఇటీవల నంద్యాల జిల్లా సీతారామపురంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవలో ఒకరు చనిపోతే ఉనికి కోసం హత్యను రాజకీయాలకు వాడుకుంటున్నారని జగన్(Jagan) పై మండిపడ్డారు.
చంద్రబాబుపై కేసు పెట్టాలని జగన్ డిమాండ్ చేయడం శోచనీయమని ఆరోపించారు. వైసీపీ పాలనలో 2,686 హత్యలు జరిగాయని, ఆయనపై కూడా కేసులు పెట్టాలని పేర్కొన్నారు. జగన్ కుటుంబ చరిత్ర అంతా రక్త చరిత్రేనని విమర్శించారు. వైఎస్ వివేకానందా రెడ్డి (YS Viveka murder) హత్యను ప్రశ్నిస్తున్న మీ చెల్లెలు సునితా రెడ్డికి సమాదానం చెప్పాలన్నారు.
భారతదేశంలోనే వైఎస్ జగన్ లాంటి క్రిమినల్ లీడర్ లేరని జాతీయ మీడియా సంస్థ పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. సీబీఐ (CBI ) కోర్టుకు వెళ్లకుండా ప్రతి శుక్రవారం ఏదో ఒక కార్యక్రమం అంటూ తప్పించుకుంటున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏనాడు కూడా హత్య రాజకీయాలను ప్రోత్సహించరని స్పష్టం చేశారు. ఇకనైనా హత్యా రాజకీయాలపై మాట్లాడటం మానుకొవాలని మంత్రులు జగన్కు సూచించారు. నంద్యాలలో కానిస్టేబుల్ సురేంద్ర మర్డర్, అబ్దుల్ సలాం సూసైడ్ ఘటనలు జరిగినప్పుడు జగన్ నంద్యాలకు ఎందుకు రాలేదు? అని ఎమ్మెల్యే అఖిల ప్రియ ప్రశ్నించారు.