Jagan helicopter | వైఎస్ జగన్‌పై చంద్రబాబు సర్కార్ కుట్రలు? జగన్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
Jagan helicopter | ఏపీలో(AP) పురపోరు కాకరేపుతున్నది. కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నది. అధికారం అండ చూసుకొని టీడీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారు.
Jagan helicopter | ఏపీలో(AP) పురపోరు కాకరేపుతున్నది. కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నది. అధికారం అండ చూసుకొని టీడీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారు. ఓటు వేయకుండా వైసీపీ శ్రేణులు, ప్రజలపై రాళ్లు రువ్వుతూ అడ్డుకుంటున్నారు. పోలీసులు సైతం పచ్చపార్టీకి అనుకూలంగా వ్యహరిస్తున్నారని విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై(YS Jagan) కూటమి సర్కార్ కుట్రలకు తెరలేపింది. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో హెలికాప్టర్ ల్యాండింగ్‌కు (,Helicopter emergency landing) ఆటంకాలు సృష్టించింది. నిన్న(శనివారం) హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చిన పోలీసులు.. చివరి నిమిషంలో అధికారులు మాట మార్చారు.
మధ్యాహ్నం 2:30 తర్వాతే హెలికాఫ్టర్ ల్యాండింగ్‌కు అనుమతిస్తామంటూ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ కొత్త ఆదేశాలు జారీ చేశారు. అయితే, అప్పటికే బెంగళూరు నుంచి హెలికాఫ్టర్‌లో వైఎస్ జగన్ బయలేర్దారు. వెనక్కి వెళ్లాలని హెలికాఫ్టర్ ఆపరేటర్‌కు అధికారులు ఫోన్ చేశారు. ఇంధన కొరతతో పులివెందులలో హెలికాఫ్టర్‌ను పైలట్.. ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. ఆఖరి నిమిషంలో అనుమతి ఇవ్వకపోవడంతో వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్ని కుట్రలు చేసినా వైసీపీ విజయాన్ని అడ్డుకోలేరని స్పష్టం చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagan helicopter | వైఎస్ జగన్‌పై చంద్రబాబు సర్కార్ కుట్రలు? జగన్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో కాజోల్.. బాలకృష్ణతో కలిసి కీలక పాత్రలో కనిపించనున్నారా?
Irumudi | రవితేజ ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు.. బాలనటి నిబంధనలపై విచారణకు ఆదేశం!
Software employee | భారీ సిమెంట్ పైపులను ఢీ కొట్టిన కారు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దుర్మరణం
Raptadu incident | వరుసకు బాబాయ్..! పెళ్లి చేసుకోవాలని బాలికపై ఒత్తిడి, రాప్తాడు ఘటనలో కీలక విషయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

