Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
Chandrababu | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బ్లాక్మెయిల్ రాజకీయాలతో బెదిరింపులకు పాల్పడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు.
అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ( YCP ) రాష్ట్రంలో బ్లాక్మెయిల్ రాజకీయాలతో ( Blackmail Politics ) బెదిరింపులకు పాల్పడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) ఆరోపించారు. ఉండవల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. ఇకనైనా బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిదని హెచ్చరించారు. నేరాలు, ఘోరాలు చేసి ఏం సాధించాలనుకుంటున్నారని వైసీపీ నాయకులను ప్రశ్నించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో గూండాయిజానికి పాల్పడుతున్నది వైసీపీయేనని ఆరోపించారు. వేరే రాష్ట్రాల నుంచి నేరస్థులను తీసుకొచ్చి కూటమి నాయకులను బెదిరిస్తున్నారని విమర్శించారు. హింస అనేది వాళ్ల డీఎన్ఏలోనే ఉందని దుయ్యబట్టారు. విధ్వంసాన్నే నమ్ముకున్న ఆ పార్టీకి గత ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. ఎక్కడైనా పోస్టర్లకు రక్తాభిషేకం చేస్తారా? అది వైసీపీకి చెల్లిందని అన్నారు. ఇకనైనా రప్పారప్పా రాజకీయాలు వద్దని, నేరగాళ్లను ప్రోత్సహించవద్దని సూచించారు. మాజీ ఎంపీ వివేకానంద ను చంపివేసి ఆ నేరాన్ని తనపై మోపారని గుర్తు చేశారు. హింసకు, నా జీవితంలో చోటు లేదని తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Guwahati Hotel Firing: గౌహతి హోటల్ ఫైరింగ్ కేసులో ప్రధాన నిందితుడి ఎన్కౌంటర్
Luxury Watches Missing | పలు కేసులకు సంబంధించిన లగ్జరీ వాచ్లు, ఇతర సాక్ష్యాధారాలు.. కోర్టు స్ట్రాంగ్ రూమ్ నుంచి మాయం
PM Modi Phone | ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్..రెండు తుపాన్ల ప్రభావంపై ఆరా
Maxing | మ్యాక్సింగ్ అంటే ఏమిటి.. దీన్ని ఎలా పాటించాలి.. దీని వల్ల కలిగే లాభాలేమిటి..?
AP Elections | రేపు ఏపీలో యథావిధిగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

