అమరావతి: ఏపీ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి(MLA Adinarayana Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. రాజంపేట వైసీపీ ఎంపీగా గెలిచిన పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి (MP Mithun Reddy) బీజేపీలో చేరేందుకు అధిష్ఠానంతో టచ్‌లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు వైసీపీ వర్గాల్లో కలవరం మొదలైంది. రాబోయే రోజుల్లో వైసీపీ ఖాళీ అవడం ఖాయంగా కనిపిస్తోందని పేర్కొన్నారు.
శుక్రవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరై ఎమ్మెల్యే ప్రమాణం చేసిన తరువాత అసెంబ్లీ లాబీల్లో ఆదినారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీజేపీ (BJP) ఒప్పుకుంటే అవినాష్‌రెడ్డి మినహా వైసీపీ ఎంపీలంతా పార్టీ మారడానికి రెడీగా ఉన్నారని, ఇందుకు బీజేపీ నాయకత్వం వద్దని చెబుతోందని వెల్లడించారు. అయినా మిథున్‌రెడ్డి లాబీయింగ్ చేస్తున్నారని , బీజేపీలో చేరాలంటూ తండ్రి పెద్దిరెడ్డిపైనా మిథున్‌రెడ్డి ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి పాలైన విషయం తెలిసిందే. గతంలో 2014లో 151 ఎమ్మెల్యేలు, 21 ఎంపీ స్థానాలు గెలిచిన వైసీపీ మొన్నటి ఎన్నికల్లో కేవలం 11 మంది మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలుగా, 25 పార్లమెంట్ స్థానాలకు 4గురు మాత్రమే ఎంపీగా విజయం సాధించారు.