ఇది పాలనా..? వడ్డీ వ్యాపారమా..? : నాదెండ్ల ఫైర్
బుధవారం పార్టీ కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై విరుచుకుపడ్డారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మరోసారి విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో సీబీఐ దత్తపుత్రుడు పాలన కొనసాగిస్తున్నారా? లేకా వడ్డీ వ్యాపారం చేస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. రైతుల నుంచి నీటి తీరువాపై వడ్డీ వసూలు చేయడం దారుణమన్నారు. అసలే గిట్టుబాటు ధరలు రాక రైతులు ఇబ్బంది పడుతుంటే.. వడ్డీ వసూలు చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. బుధవారం పార్టీ కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు.
2018 నుంచి నీటి తీరువా లెక్కించిన ప్రభుత్వం.. రైతుల మెడలు వంచి 6 శాతం వడ్డీతో వసూలు చేయాలని నిర్ణయించడం కన్నా దారణమైన విషయం మరోటి ఉండదన్నారు. అసలు, వడ్డీ చెల్లించకపోతే రైతు భరోసా ఇవ్వమని, భవిష్యత్‌లో పంట నష్ట పరిహారానికి అనర్హులుగా చేస్తామని బెదిరించడాన్ని నాదెండ్ల తప్పుపట్టారు. ఇది ఏమాత్రం ప్రజాప్రభుత్వానికి ఉండాల్సిన లక్షణాలు కావాలన్నారు.
ఆస్తి పన్ను చెల్లించని పలు ఇళ్లకు తాళాలు వేసిన విషయం గత నెలలో చూశామని, ఇంట్లో సామాను తీసుకుపోతామని బ్యానర్లు కట్టి ట్రాక్టర్లు తిప్పారని నాదెండ్ల గుర్తు చేశారు. ఇప్పుడు తమ ప్రతాపాన్ని రైతులపై చూపేందుకు సిద్ధపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి పన్ను పేరుతో వేధింపులకు దిగుతున్నారని, గ్రామాలవారీగా నీటి పన్ను వసూలు టార్గెట్ పెట్టి మరీ వసూలు చేస్తున్నారని చెప్పారు. ప్రకాశం జిల్లా అన్నసముద్రం గ్రామానికి రూ.29 లక్షల నీటి పన్ను వసూలు టార్గెట్ పెట్టారంటే.. రాష్ట్రం మొత్తం మీద ఎన్ని కోట్లు వడ్డీతో పాటు రాబట్టాలనుకొంటున్నారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు రావాల్సిన రూ.7 లక్షల పరిహారాన్ని కూడా 6 శాతం వడ్డీతో చెల్లించాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

