అమరావతి : అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో టీడీపీ నేత అయ్యన్నపాత్రుడి ఇంటి గోడ కూల్చివేతను నిరసిస్తూ అయ్యన్నపాత్రుడి కుటుంబ సభ్యులు ఇంటి వద్దే నిరసన ధీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా అయ్యన్న కుమారుడు విజయ్ ధీక్ష శిబిరం వద్ద మాట్లాడుతూ ప్రభుత్వం, అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ తమ ఇంటి గోడను అక్రమంగా కూల్చివేశారని ఆరోపించారు. ఏపీ సీఎం జగన్ బీసీలను అణగదొక్కుతున్నాడని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న జగన్కు వ్యతిరేకంగా ధీక్షలను నిర్వహిస్తున్నానని తెలిపారు.
పోలీసుల తీరుకు నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో ‘చలో నర్సీపట్నం’ కు పిలుపు నివ్వడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు నర్సీపట్నం రాకుండా పట్టణంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ధీక్ష శిబిరానికి రాకుండా ముందస్తుగా టీడీపీ నాయకులను గృహనిర్బంధం చేశారు.