అమరావతి : విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఆలయం భవానీ భక్తులతో కిటకిటలాడుతుంది. ఈనెల 15 నుంచి 19 వరకు భవానీ మాల దీక్షల విరమణకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా గురువారం నుంచి ఆలయంలో దీక్షల విరమణ ప్రక్రియ ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచే ఆలయంలో సుప్రభాత సేవ, అమ్మవారికి స్నపనాభిషకం నిర్వహించిన అనంతరం హారతిని సమర్పించారు. దుర్గామల్లేశ్వర స్వామి దర్శనం కోసం రెండు క్యూలైన్లను ఏర్పాటు చేశారు.
దర్శనం పూర్తయిన తరువాత మల్లేశ్వరాలయ మెట్ల మార్గంలో మల్లికార్జున మహామండపం దిగువన ఏర్పాటు చేసిన ప్రాంతంలో ఇరుముడులు గురుభవానీలకు సమర్పించారు. రూ. 500 టికెట్లు తీసుకున్న భక్తులను అమ్మవారి అంతరాలయ దర్శనానికి అనుమతిస్తున్నట్లు ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు. సీతమ్మవారి పాదాల వద్ద ఏర్పాటుచేసిన తాత్కాలిక కేశఖండన శాల వద్ద తలనీలాలు సమర్పించి ఘాట్ల వద్ద స్నానాలు చేసి దీక్షా వస్త్రాలను దేవస్థానం అధికారులు ఏర్పాటుచేసిన ప్రాంతంలో వదిలిపెట్టారు.
భవానీ దీక్షల విరమణ సందర్శంగా రైల్వే అధికారులు పలు ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా రైళ్లను నడుతుపుతుంది. ఆలయ పరిసరాల్లో ఎలాంటి తొక్కిసలాట జరుగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు.