ఉప ఎన్నికల్లో ఓటర్ల కుడిచేతి వేలికి సిరా

తిరుపతి: ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటర్లకు కుడిచేతి చూపుడు వేలికి సిరా వేయనున్నారు. ఈ మధ్యే ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో ఎడమ చూపుడు వేలికి సిరా పూశారు. ఆ సిరా గుర్తు ఇంకా పోకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఆదేశాలు జారీచేసింది. వైఎస్సార్సీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో తిరుపతి లోక్సభ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో ఈ స్థానానికి వచ్చే నెల 17న ఉప ఎన్నిక జరగనుంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమయ్యింది.
ప్రతి ఎన్నికల్లో ఓటేసే ఓటరుకు అధికారులు ఎడమచేతి చూపుడు వేలికి సిరా వేయటం ఆనవాయితీగా వస్తోంది. ఇటీవల జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఆ సమయంలో ఓటర్ల ఎడమచేతి వేలికి వేసిన ఇండెలిబుల్ సిరా ఇంకా కొందరికి చెరిగిపోలేదు. అలాంటివారు ఓటు వేసేందుకు వెళితే పోలింగ్ అధికారులు వెనక్కుపంపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కుడి చేతి చూపుడు వేలికి సిరా వేయాలని సీఈసీ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు పోలింగ్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

