తిరుమల : తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ పెరిగింది. వారాంతపు సెలువు దినంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు ముగింపు దశకు వస్తుండడంతో వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో తిరుమలలో ఉన్న 31 కంపార్టుమెంట్లు ( Compartments ) భక్తులతో నిండిపోయి శిలాతోరణం వరకు క్యూలైన్లో నిలబడ్డారు.
టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 88,257 మంది భక్తులు దర్శించుకోగా 45,068 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల శ్రీవారి హుండీకి రూ.3.68 కోట్లు వచ్చాయని తెలిపారు.