తిరుమల : తిరుమల(Tirumala) వెంకన్న సన్నిధిలో భక్తుల రద్దీ(Devotees crowd) కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల క్షేత్రంలోని 13 కంపార్ట్మెంట్లు(Compartments) నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం(Sarvadarsan) కలుగుతుందని టీటీడీ అధికారులు(Ttd Officials) వెల్లడించారు.
నిన్న స్వామివారిని 60,699 మంది భక్తులు దర్శించుకోగా 23,096 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4కోట్లు వచ్చిందని తెలిపారు.
ఒంటిమిట్ట రాములవారి కల్యాణానికి తలంబ్రాల తయారీ ప్రారంభం
Ontimitta
శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 5న కడపలోని శ్రీ సీతారాముల కల్యాణం కోసం ఆలయంలో తలంబ్రాల తయారీని ప్రారంభించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమరనాథరెడ్డి, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి కలిసి డిప్యూటీ ఈఓ నటేష్ బాబుకు అందజేశారు. అక్కడినుంచి ఊరేగింపుగా కల్యాణవేదిక వద్ద గల పిఏసి వద్దకు తీసుకొచ్చారు.
ఇక్కడి హాలులో బియ్యం, పసుపు, నెయ్యి కలిపి తలంబ్రాలు తయారు చేస్తున్నారు. తలంబ్రాలతో పాటు ముత్యం, కంకణం ఉంచి ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నారు. దాదాపు 350 మంది శ్రీవారి సేవకులు 1.75 లక్షల తలంబ్రాల ప్యాకెట్లను తయారు చేస్తున్నారు.