అమరావతి : ఆంధ్రప్రదేశ్లో రైతులు, కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రంలో సాగును నమ్ముకున్న వారి పరిస్థితి దయనీయంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరి జిల్లాల్లోనే 80 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు. ఉగాది పూట ఆ కుటుంబాలు దుఃఖంతో ఉండొద్దని అన్నారు.
ఒక్కో కుటుంబానికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు ఆయన ప్రకటించారు. కౌలు రైతుల బాధలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రైతులు, కౌలు రైతుల పక్షాన అండగా నిలుస్తామని, త్వరలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శిస్తానని వెల్లడించారు.