అమరావతి : తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సిట్టింగ్ జడ్జి(Sitting Jugde) తో సీబీఐ విచారణ జరిపితే చంద్రబాబు అబద్దాలు బయటకు వస్తాయని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా(Former Minister Roja) పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో సోమవారం జరిగిన విచారణలో లడ్డూ కల్తీ (Laddu Adulterattion) పై ఏపీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు.
ఈ సందర్భంగా రోజా ట్విటర్లో స్పందిస్తూ లడ్డూ కల్తీపై ఎలాంటి సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా వ్యాఖ్యలు చేసి హిందూవుల మనోభావాలను అగౌరవపరిచారని ఆరోపించారు. స్వలాభం కోసం పవిత్రమైన తిరుమల (Tirumala) లడ్డూపై నిందవేశాడని మండిపడ్డారు. వైసీపీ అధినేత జగన్‌ను హిందూవుల నుంచి దూరం చేయాలనే దురుద్దేశ కుట్రతో తిరుమల లడ్డూ పవిత్రతపై కామెంట్ చేశాడని సుప్రీంకోర్టులో(Supreme Court) రుజువు కాబోతుందని వెల్లడించారు.
లడ్డూ కల్తీ అంశంపై ఉన్నతస్థాయి విచారణ జరిగితే ఎక్కడా అబద్దం బయట పడుతుందన్న కారణంతో తనకు అనుకూలురైన అధికారులతో సిట్ ఏర్పాటు చేశారని దుయ్యబట్టారు. తమకు మొదటి నుంచి సిట్‌పై నమ్మకం లేదని ఆమె అన్నారు. తప్పుడు వ్యాఖ్యలు చసి మతకల్లోలు సృష్టించడానికి ప్రయత్నించాడని ఆరోపించారు. చంద్రబాబు నిందతో లడ్డూలు తినలా వద్దా అనే అనుమానం భక్తుల్లో కలుగుతుందన్నారు. తప్పుడు ప్రకటన చేసిన వారిని శిక్షించాలని మధురై వద్ద ఉన్న అళగన్కోయిల్ దక్షిణ తిరుమల భగవంతుడిని, సుప్రీంకోర్టును కోరుకున్నానని ఆమె తెలిపారు.