అమరావతి : ఏపీ రాజధాని అమరావతి భూములు, భవనాలపై ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకునే నిర్ణయాలను అంగీకరించే ప్రసక్తేలేదని అమరావతి ఐక్య కార్యచరణ సమితి నాయకులు స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఖరిని మార్చుకోకపోతే తాము మళ్లీ కోర్టుకు వెళ్తామని వెల్లడించారు. భూమిలిచ్చింది రాజధాని నిర్మాణానికే గానీ లీజుల కోసం కాదని పేర్కొన్నారు. ప్రభుత్వ భవనాలు ఉద్యోగులకు ఇస్తే ప్రభుత్వానికి అద్దెభత్యం భారం తగ్గుతుందని అన్నారు.
ఉద్యోగుల కోసం నిర్మించిన భవనాలు లీజుకివ్వాలనే ప్రతిపాదనపై అభ్యంతరం తెలిపారు. అమరావతిలోని ప్రభుత్వ భవనాలను లీజుకు ఇచ్చే హక్కు ప్రభుత్వానికి లేదని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడ ఉంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు. భవనాలు ఎవరికోసం నిర్మించారు. ఎవరికి విక్రయిస్తున్నారని మండిపడ్డారు.