అమరావతి : ఏపీలో అధికార పార్టీకి చెందిన రెబెల్ పార్లమెంట్ సభ్యుడు రఘురామ ప్రభుత్వానికి కొరక రాని కొయ్యలా మారుతున్నారు. రోజుకో విధంగా ప్రభుత్వం, పార్టీపై ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ప్రతిరోజూ ఢిల్లోలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సీఎం జగన్, పార్టీకి చెందిన నాయకులు, మంత్రులు, ఎంపీలపై వ్యంగ్యస్త్రాలు సందిస్తున్నారు.
తాజాగా ఈరోజు కూడా మాట్లాడుతూ పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా మాట్లాడు తున్నందున తనపై అనర్హత వేటు వేసేందుకు పార్టీ నేతలకు సమయమిచ్చానని, మరోసారి ఈనెల 11వరకు సమయమిస్తున్నానని సవాలు విసిరారు. నావల్ల కాదు..రాజీనామా చేయమని సీఎం అడిగితే చేస్తానని వ్యాఖ్యలు చేశారు. రాజీనామా ఎప్పుడు అనేది సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. తాను 5వ తేదీనే రాజీనామా చేస్తానని ఏనాడు చెప్పలేదు స్పష్టం చేశారు.