అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి అంబటి రాంబాబు (AP Minister Ambati) ఘాటుగా సమాధానమిచ్చారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. సంక్రాంతి పండుగ రోజున నియోజకవర్గ ప్రజలు, కుటుంబ సభ్యులతో డాన్స్ చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. చంద్రబాబు (Chandrababu) రోజుకో పార్టీతో డాన్స్ చేసే వ్యక్తని , ఆయనలా నేను పొలిటికల్ డాన్సర్ (Political Dancer) ను కాదని ఘాటుగా సమాదానమిచ్చారు.
రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులపై బాబు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరాన్ని( Polavaram) ఏటీఎంలా వాడుకున్న చంద్రబాబు తప్పిదం వల్లే ప్రాజెక్టు పూర్తికావడానికి ఆలస్యం అవుతుందని ఆరోపించారు.
కుప్పంలో చంద్రబాబు, పిఠాపురంలో పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) ఓడిపోవడం ఖాయమని అన్నారు. ఏపీ సీఎం జగన్‌ను విమర్శించే నైతిక అర్హత చంద్రబాబుకు లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో మరోసారి వైసీపీ గెలుస్తుందని సర్వేలన్నీ చెబుతున్నాయని, అదే ఫ్రస్టేషన్లో చంద్రబాబు ఉన్నారని ఎద్దేవా చేశారు.