Srisailam | శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారల దేవస్థానంలో జరుగుతున్న శాశ్వత అన్నప్రసాద పథకానికి హైదరాబాద్‌కు చెందిన భక్తుడు శంకర వెంకట కామేశ్వరరావు విరాళం అందజేశారు. శనివారం నాడు దేవస్థాన పర్యవేక్షకులు ఎం.రవికుమార్‌కు ఆలయ ప్రాంగణంలో 1,06,116 రూపాయలను విరాళమిచ్చారు.
ఈ సందర్భంగా దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందజేశారు. అనంతరం ఆయన్ను సత్కరించారు.