Tirumala | తన భార్యకు తెలియకుండా సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడో భర్త.. హైదరాబాద్ నుంచి తిరుమలకు వచ్చి మరీ పెళ్లికి సిద్ధమయ్యాడు. కానీ సడెన్‌గా వైఫ్ ఎంట్రీతో అతని ప్లాన్ బెడిసికొట్టింది. భర్త కుట్రను ఎలాగో తెలుసుకున్న భార్య తన కుటుంబసభ్యులతో కలిసి పెళ్లి టైమ్‌కు కల్యాణ మండపానికి ఎంట్రీ ఇచ్చింది. దీంతో పెళ్లిపీటల మీద నుంచి వరుడు మెల్లిగా జారుకున్నాడు. తిరుమలలో కలకలం సృష్టించిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్‌కు చెందిన రాకేశ్‌కు వరంగల్ జిల్లా పెద్ద పెండ్యాలకు చెందిన సంధ్యతో వివాహమైంది. వారికి ఏడేళ్ల కుమార్తె కూడా ఉంది. కానీ సంధ్యకు విడాకులు ఇవ్వాలని రాకేశ్ అనుకున్నాడు. విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. ఈ క్రమంలోనే మొదటి భార్యకు తెలియకుండా రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఇవాళ ఉదయం తిరుమలలోని గోగర్భం డ్యామ్ వద్ద ఉన్న ఓ మఠంలో రెండో పెళ్లి చేసుకోబోయాడు. అయితే తన భర్త రెండో వివాహం గురించి తెలుసుకున్న సంధ్య తన కుమార్తె, కుటుంబసభ్యులతో కలిసి కల్యాణ మండపానికి చేరుకుంది.
కళ్యాణ మండపం వద్దకు తన మొదటి భార్య సంధ్య రావడం గమనించిన రాకేశ్, అతని కుటుంబ సభ్యులు అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో అక్కడ ఉన్న కొంతమందిని సంధ్య కుటుంబ సభ్యులు పట్టుకుని తిరుమల పోలీస్ స్టేషన్లో అప్పగించారు. కాగా, తనకు న్యాయస్థానం ఇంకా విడాకులు మంజూరు చేయలేదని.. తన భర్తతో ఉండేందుకు కోర్టు తమకు అనుమతి మంజూరు చేసిందని తెలిపారు. కానీ రాజకీయ నాయకుల అండదండలతో తన భర్త తనను ఇంటి నుంచి తరిమేశారని వాపోయింది. తన భర్త రెండో పెళ్లికి సిద్ధమయ్యాడని తెలుసుకుని తిరుమలకు వచ్చి ఆపేశానని చెప్పింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.