హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): తిరుమలలో శ్రీవారి దర్శనం టికెట్ లేని భక్తులకు 12 గంటల్లో, ప్రత్యేక దర్శనం 4 గంటల్లో లభిస్తున్న ది. 65,131 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 30,998 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ లో రూ.4.66 కోట్లు వచ్చినట్టు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ నెల 15 నుంచి 17 వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరుగనున్నాయి.
ఏపీ ఎంబీబీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్
హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య, దంత కళాశాల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో కన్వీనర్ కోటా ప్రవేశాల కోసం విజయవాడలోని ఆరో గ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. 16 వరకు http://ap uhs&ugadmissions.aptonline.in దరఖాస్తు చేసుకోవచ్చు.
10 ఇండిపెండెంట్ ప్రతేక్య రైళ్లు : ఎస్సీఆర్
హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): కాచిగూడ-తిరుపతి, మ చిలీపట్నం-వికారాబాద్ వంటి రైల్వే స్టేషన్ల మధ్య 10 ఇండిపెండెంట్ ప్రత్యే క రైళ్లను ఏర్పాటుచేసినట్టు శనివారం రైల్వే అధికారులు ప్రకటన జారీ చేశారు. ధనపూర్-బెంగళూరు స్టేషన్ల మధ్య మరో 10 ప్రత్యేక రైళ్లను పొడిగించినట్టు పేర్కొన్నారు.