అమరావతి : రేపటి సమాజాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాల్సినే కొందరు గురువులు తప్పటడుగులు వేస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన చోట ఓ బాధ్యత గల హెడ్మాస్టర్( Head Master) మద్యం తాగి (Drink alcohol) వచ్చి ఉన్నతాధికారిపై చిందులేశాడు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంటినవలస హైస్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఏపీలో తాగి స్కూలుకు వస్తున్న టీచర్
మద్యం మత్తులో డిప్యూటీ డీఈవో ఎదుటే చిందులేసిన హెడ్మాస్టర్
విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంఠినవలస హైస్కూల్లో మద్యం తాగి విధులకు హాజరైన హెడ్మాస్టర్
విచారణకు వచ్చిన డిప్యూటీ డీఈవో ముందే అసభ్య పదజాలంతో రెచ్చిపోయిన హెచ్ఏం pic.twitter.com/4gcoqeiaOd
— Telugu Scribe (@TeluguScribe) September 20, 2025
గత కొంతకాలంగా హెడ్మాస్టర్ మద్యం తాగి పాఠశాలకు వస్తున్నాడని ఫిర్యాదులు అందడంతో డిప్యూటీ డీఈవో ( Deputy DEO ) విచారణ కోసం పాఠశాలకు వచ్చాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న హెడ్ మాస్టర్ డిప్యూటీ డీఈవో ముందే అసభ్యపదజాలంతో రెచ్చిపోయాడు. ఇదంతా సెల్ఫోన్లో రికార్డయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు అతడిపై చర్యలకు సిద్ధమవుతున్నారు.