అమరావతి : తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై తమిళ హీరో కార్తీ(Hero Karthi ) , ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు క్షమాపణ కోరారు. పవన్‌కల్యాణ్‌పై తనకు అమితమైన గౌరవం ఉంది. అనుకోని అపార్థానికి క్షమాపణ (Apology) కోరుతున్నానని ట్విట్టర్(Twitte) లో పేర్కొన్నారు. నేనూ కూడా వేంకటేశ్వరస్వామి భక్తుడినని, ఎల్లప్పుడూ మన సంప్రదాయాలను గౌరవిస్తానని వెల్లడించారు.
నిన్న సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్లో తిరుమల లడ్డూ (Tirumala Laddu) గురించి కార్తీ సెటైర్లు వేశారు. లడ్డూ కావాలా నాయనా అని అడిగారు. అందుకు కార్తీ స్పందిస్తూ.. లడ్డూ టాపిక్ వద్దని.. ఇప్పుడు ఆ అంశం సెన్సిటివ్ టాపిక్ అని కామెంట్ చేశారు. లడ్డూ పవిత్రను దెబ్బతీసేలా కార్తీ మాట్లాడారని, తీరు మార్చుకోవాలని పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. కార్తీ వ్యాఖ్యలను పవన్ కల్యాణ్ ఖండించారు.
లడ్డూ మీద జోక్స్ వేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని సూచించారు.లడ్డూ గురించి కామెంట్ చేయడం సరికాదు. లడ్డూ సెన్సిటివ్ ఇష్యూ అని హీరో కార్తీ అన్నారు. అలా అనడం కరెక్ట్ కాదు. కార్తీ చేసిన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయి. మరోసారి కార్తీ అలా అనొద్దు. ఓ నటుడిగా కార్తీ అంటే నాకు గౌరవం. కానీ లడ్డూ విషయంలో చేసిన కామెంట్లు మాత్రం సరికాదు. సనాతన ధర్మాన్ని అందరూ గౌరవించాలి అని’ పవన్ కల్యాణ్ సూచించారు.