అమరావతి : ఏపీలో కూటమి ప్రభుత్వం ఆరోగ్య శ్రీని (Arogya Shri) పట్టించుకోవడం లేదని వైసీపీ నాయకురాలు విడదల రజిని (Vidadala Rajini) దుయ్యబట్టారు. ఆరోగ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ వైసీపీ (YCP) పాలనలో 104, 108 అంబులెన్స్ సేవలను ప్రజలకు అందుబాటులో ఉంచగా నేడు కూటమి హయాంలో గంటల తరబడి కూడా రోగుల వద్దకు చేరుకోలేకపోతున్నాయని విమర్శించారు.
ఆరోగ్య శ్రీని అనారోగ్య శ్రీగా మారుస్తున్నారని ఆరోపించారు. సంబంధిత మంత్రి వైసీపీ పాలనలో ఆరోగ్య శాఖపై అర్థం లేని ఆరోపణలు చేస్తు జగన్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఏపీని మెడికల్ హబ్‌గా (Medical Hub) తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 17 మెడికల్ కళాశాలలు మంజూరు చేసిందని వెల్లడించారు
. కళాశాలల భవనాల కోసం రూ. 8,500 కోట్లు ఖర్చు చేశామని, వాటిని పూర్తి చేయలేక వైసీపీపి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెఫ్ట్‌తో గ్రామాల్లోకి సూపర్ స్పెషాలిటీ సేవలను అందించామని మాజీ మంత్రి అన్నారు.