అమరావతి : ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు (Chandra Babu) సర్కార్ ఐదు నెలల్లో అప్పులు తప్ప ఏమీ చేయలేదని వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్ రెడ్డి (Goebbels campaign) ఆరోపించారు. హామీల నుంచి తప్పించుకునేందుకు వైసీపీ (YCP) నాయకులపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శ
నివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అభూత కల్పనలతో వైసీపీ ఆరోపణలు చేస్తూ ప్రజల మైండ్‌ను డైవర్ట్ చేస్తున్నారని విమర్శించారు. తిరుమల లడ్డూ నుంచి సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టు వరకు , వైఎస్ జగన్ ఇంట్లో కలహాల నుంచి అదానీ ఒప్పందాల వరకు కట్టుకథలు అల్లుతూ దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.
2014-19వరకు సీఎంగా ఉన్న చంద్రబాబు సోలార్ పవర్ (Solar Power) రూ. 5.50 పైసలతో 20 సంవత్సరాలకు ఒప్పందని చేసుకున్నారని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత దానిని రూ. 2.30 పైసలతో సెకీతో ఒప్పందం చేసుకుని ప్రజలకు భారం తగ్గించామని వెల్లడించారు. వైఎస్ జగన్ ఏపీలో విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసేందుకు చంద్రబాబు 13 వేల కోట్లు ఇస్తే జగన్40 వేల కోట్లు డిస్కాంలకు ఇచ్చారని వివరించారు.