అమరావతి : అన్నమయ్య జిల్లా ( Annamaiah District) రాయచోటి తొగటవీధిలో దారుణం జరిగింది. ఇంట్లో గ్యాస్ సిలిండర్(Gas cylinder) పేలి ముగ్గురు తల్లి, కుమారుడు, కుమార్తె సజీవదహనమయ్యారు. ఈ ఘటనపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఉదయం తొగటవీధిలో గ్యాస్ సిలిండర్ పొగలు వ్యాపించి మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది(Fire Staff) ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
అయితే ఈ ఘటనలో తల్లి రమాదేవి(34), కుమారుడు మనోహర్(9), కుమారెత మన్విత (5) సజీవదహన మయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇంట్లోని సీసీ కెమెరాలను(CC Cameras) పరిశీలించి అనుమానాలు వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ రామచంద్ర తెలిపారు.
ప్రమాదవశాత్తు జరిగిందా? కావాలని చేశారా? అనే కోణంలో దర్యాప్తుచేస్తున్నట్లు వెల్లడించారు. కాగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు తెలిసిందని, సీసీ కెమెరాలు పరిశీలించి నిజనిజాలు తేలుస్తామని పేర్కొన్నారు.