అమరావతి : ఎన్డీయే ప్రభుత్వానికి కీలక భాగస్వామ్యంగా ఉన్న టీడీపీ కూటమికి వెన్నుదన్నుగా ఉండేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో విజయవాడ గన్నవరం ఎయిర్పోర్టు(Gannavaram airport ) కు మరింత భద్రతను పెంచింది.
విజయవాడకు ముఖ్యుల రాకపోకలు పెరుగనున్నందున వచ్చే నెల 2 నుంచి విజయవాడలోని గన్నవరం ఎయిర్పోర్టు సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) ఆధీనంలోకి వెళ్లనుంది. ఈమేరకు ఎయిర్పోర్టు ఆథారిటీ అధికారులు గురువారం డీజీపీ (DGP) కి లేఖ రాశారు.
ప్రస్తుతం అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఎస్పీఎఫ్ విభాగాన్ని ఉప సంహరించాలని కోరారు. జులై 2 నుంచి విధుల్లో చేరనున్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది కోసం బ్యారక్లు కూడా ఖాళీ చేయాలని ఎయిర్పోర్టు అథారిటీ(Airport Authority) అధికారులు కోరారు.