శ్రీశైలం : ప్రసిద్ధిగాంచిన శ్రీశైలం (Srisailam) భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో బుధవారం నుంచి గణపతి నవరాత్రోత్సవాలు ( Ganapati celebrations ) వైభవంగా ప్రారంభమయ్యాయి . ఆలయ ప్రాంగణంలోని రత్నగర్భగణపతి, యాగశాలలో కాంస్య గణపతిమూర్తికి, సాక్షిగణపతి ఆలయంలోని వర సిద్ధి వినాయక స్వామి ఆలయానికి పూజాకార్యక్రమాలు నిర్వహించాయి .
ఉత్సవాల ప్రారంభంలో భాగంగా యాగశాల ప్రవేశం, వేదస్వస్తి,శివ సంకల్పం, గణపతిపూజ, కంకణపూజ, రుత్విగ్వరణం, కంకణధారణ, పుణ్యాహవాచనం, తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ఎం శ్రీనివాసరావు దంపతులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.