Swarnamukhi River | తిరుపతి జిల్లా వేదాంతపురంలో విషాదం నెలకొంది. స్వర్ణముఖి నదిలో ఈతకు దిగిన ఏడుగురు యువకులు నీటి ప్రవాహానికి గురయ్యారు. ఇసుక దిబ్బలపై ఆడుకుంటూ నీటిలో స్నానం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఏడుగురిలో విష్ణు, మణిరత్నం, కృష్ణ అనే ముగ్గురు యువకులు ప్రాణాలతో బయటపడగా.. నలుగురు గల్లంతయ్యారు. వరద నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన యువకుల్లో ప్రకాశ్ (17), చిన్నా (15), తేజూ (19), బాలు (16)గా పోలీసులు గుర్తించారు. వీరిలో ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. గల్లంతైన ఇద్దరు యువకుల కోసం రెస్క్యూ టీం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. నదిలో ప్రస్తుతం వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోంది.