
Road Accident | ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. బత్తలపల్లి మండలం జ్వాలాపురం జాతీయ రహదారిపై జరిగిన ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మరణించారు.
అనంతపురం జిల్లాలో జరిగే వివాహనికి హాజరయ్యేందుకు చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన ఆ కుటుంబం కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు ముందు టైర్ పేలింది. అనంతపురం నుంచి చెన్నైకి వెళుతున్న లారీని కారు ఢీకొట్టింది. దీంతో ఆ కారులో ప్రయాణిస్తున్న అమ్మాజీ (50), ఆమె కుమారుడు రెడ్డి బాషా (25), కూతురు రేష్మ (30), అల్లుడు బాబు (36) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
బాబు-రేష్మ కూతురు జస్మిత(5)కు తీవ్ర గాయాలయ్యాయి. బాలికను చికిత్స నిమిత్తం అనంతపురంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. స్థానికుల సాయంతో కారులో చిక్కుకుపోయిన మృతదేహాలను వెలికితీశారు.