AP Rains | ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజికి రికార్డు స్థాయిలో వరద నీరు కొట్టుకొస్తున్నది. ఈ వరద ఉధృతిలో పెద్ద ఎత్తున బోట్లు కొట్టుకొస్తున్నాయి. బ్యారేజి 3, 4 గేట్లను నాలుగు బోట్లు వచ్చి ఢీకొన్నాయి.
వరద ఉధృతితో తొలుత ఎగువ నుంచి ఒక బోటు కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజిని ఢీకొట్టింది. ఏం జరుగుతుందా అని చూసేలోపే మరో మూడు బోట్లు వచ్చి బ్యారేజి గేట్లను ఢీకొట్టాయి. 40 కి.మీ. వేగంతో వచ్చి బోట్లు ఢీకొట్టడంతో గేటు లిఫ్ట్ చేసే ప్రాంతం దెబ్బతిన్నది. కాగా, బోట్లు కొట్టుకురావడంపై అధికారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే వేరే ప్రాంతం నుంచి కొట్టుకొస్తున్నాయా? ఎవరైనా పనిగట్టుకుని చేస్తున్నారా? అని సందేహిస్తున్నారు.
కృష్ణా నదికి పైనుంచి వస్తున్న వరద ఉద్రతకు ఇసుక బోట్లు ప్రకాశం బ్యారేజ్ వద్దకు కొట్టుకొచ్చాయి
ప్రకాశం బ్యారేజ్ గేట్లకు ఢీకొనడంతో సిమెంట్ బిళ్ళలు పగుళ్లు 69 వ కానా వద్ద ఇరుక్కుపోయిన మూడు ఇసుక పడవలు#vijayawada #prakashambarrage pic.twitter.com/JWHlEZxPI9
— Arjun KompalliTDP (@ArjunKompalli) September 2, 2024
సహాయక బోటు గల్లంతు
కాగా, కృష్ణా జిల్లా తోటవల్లూరు మండలంలో పునరావాస శిబిరానికి తీసుకొస్తున్న బోటు గల్లంతైంది. అన్నవరపులంక నుంచి బాధితులను తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బోటులో 8 మంది ఉండగా.. ఆరుగురిని స్థానికులు కాపాడారు. మరో ఇద్దరి ఆచూకీ కోసం సహాయ బృందాలు గాలిస్తున్నాయి.
Srisailam1
శ్రీశైలం ప్రాజెక్టు గేట్లలో సమస్య
శ్రీశైలం ప్రాజెక్టు గేట్లలో సాంకేతిక సమస్య నెలకొంది. 2,3 గేట్ల ప్యానల్లో బ్రేక్ కాయిల్స్ కాలిపోయాయి. వరద ఉధృతి కారణంగా గేట్ల హైట్ పెంచుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బ్రేక్ కాయిల్స్‌ను పునరుద్ధరించేందుకు అధికారులు యత్న్తిన్నారు.