అమరావతి : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు భవనానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా సోమవారం శంకుస్థాపన చేశారు. అమరావతిలో ప్రస్తుతమున్న హైకోర్టు భవనం పూర్తిస్తాయి కోర్టు విధుల నిర్వహణకు సరిపోకపోవడంతో హైకోర్టు ఎదురుగా జీ+5 సామర్ధ్యంతో అదనపు భవనాన్ని నిర్మిస్తున్నారు.
నిర్మాణానికి అవుతున్న ఖర్చు, నాణ్యతా ప్రమాణాలు , నిర్మాణ పూర్తికి ఉన్న గడువు తదితర వివరాలను అధికారులు ఏపీ హైకోర్టు సీజేకు వివరించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, సీఆర్డీఏ అధికారులు, ప్రభుత్వ న్యాయవాదులు, బార్ అసోయేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.