AP News | వైసీపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. అధికారంలోకి రావడం ఖాయం, వడ్డీతో కలపి చెల్లిస్తాం
AP News | వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమరావతి : వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి ( Peddireddy Ramchander reddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వ అరాచక పాలనను రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని వెల్లడించారు. రాబోయే రోజుల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయం. అప్పుడు వడ్డీతో కలిపి తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు. గత ఎన్నికల్లో ఈవీఎం (EVM ) లు లేకపోతే వైఎస్ జగన్ చెప్పినట్లు వై నాట్ 175 సీట్లు వైసీపీ తప్పక గెలిచేదని అన్నారు. ఆ ఫలితాలు రాకుండా ఈవీఎంలు పనిచేశాయని ఆరోపించారు.
ఈసారి ఈవీఎంలు గాని, మరేదైనా పెట్టుకున్న వైసీపీ అధికారంలోకి వస్తుందని, జగన్ మోహన్‌రెడ్డి సీఎం అవుతారని ధీమాను వ్యక్తం చేశారు. పుంగనూరులో పోలీసులు కూడా గాయపడ్డారని తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో టీడీపీ గూండాలు నామినేషన్ల కేంద్రాల వద్ద దాడులకు పాల్పడ్డారని, వైసీపీ అభ్యర్థుల పోటీ వల్ల తాము ఓడిపోతామన్న భయంతో వైసీపీ అభ్యర్థుల నామినేషన్ల పత్రాలను లాక్కున్నారని ఆరోపించారు.
పుంగనూరుకు బయట రాష్ట్రాల నుంచి వ్యక్తుల నుంచి తీసుకొచ్చి దాడులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థ, అధికారులు నీతివంతమైన పాలన బదులు బంట్రోతుల మాదిరిగా చంద్రబాబు చెప్పిన విధంగా పనిచేస్తున్నారని విమర్శించారు. అధికార పక్షానికి తొత్తులుగా పనిచేస్తున్న అధికారులకు తగిన బుద్ది చెప్పడం ఖాయమని తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TTD EO | శ్రీరంగం శ్రీ రంగనాథస్వామివారికి టీటీడీ ఈవో పట్టువస్త్రాల సమర్పణ
Shiva Kandukuri | వివాహబంధంలోకి అడుగుపెట్టనున్న టాలీవుడ్ నటుడు శివ కందుకూరి.!
BRS Dharna | కోయిల్ సాగర్ ప్రాజెక్టు వద్ద బీఆర్ఎస్ ధర్నా.. నీటి తరలింపు ప్రతిపాదన విరమించుకోవాలని డిమాండ్
Harish Rao | దమ్ముంటే నువ్వే సిద్దిపేటలో నా మీద పోటీ చెయ్.. సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్
Negligence | ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో అధికారుల నిర్లక్ష్యం..సర్పంచును పక్కనపెట్టి ప్రారంభోత్సవం
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

