అమరావతి : వైసీపీ( YCP ) మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ( Karumuri Nageswara Rao) ను ఈడీ పోలీసులు అరెస్టు ( Arrest ) చేశారు. లిక్కర్ రవాణా కేసులో నిందితుడిగా ఉన్న ఆయనను హైదరాబాద్‌లోని కొండాపూర్ నివాసంలో అరెస్టు చేసి బషీర్‌బాగ్‌లో ఈడీ కార్యాలయానికి తరలించారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ వ్యాపారుల నుంచి రూ.28 కోట్లు ముడుపులు తీసుకున్న ట్లు ఆరోపణలు రావడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్‌కుమార్, ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, రాజ్ కెసీరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.