అమరావతి : సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ( Prakash Raj ) , యూట్యూబర్ రావణ్ ( Ravan )పై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ( Vijayasai Reddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరిని వైసీపీ ( YCP ) సమర్థించడం హిందూత్వంపై దాడేనని, ఇలాంటి భావాలను మతపరమైన ఉగ్రవాదంగానే భావించాలని బుధవారం ట్విట్ చేశారు.
రావణ్, ప్రకాశ్రాజ్లు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు ? వీరికి మద్దతు ఇస్తున్నది ఎవరు ? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. వీరు ఏ సంస్కృతికి వారసులు? వీరి తండ్రులు, తాతలు ఎవరు? వీరి మూలాలు ఎక్కడున్నాయో తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని సూచించారు.
ఓసీల్లో ప్రధానంగా రెండు అధికార కులాల నుంచి కొద్దిమంది, కన్వర్ట్ అయిన వారు కన్వర్ట్ అయిన తరవాత కూడా, వారి కులాన్ని వదిలిపెట్టకుండా పేరు చివర కులాన్ని తగిలించు కుని వేరే మత వ్యవస్థల్ని నడిపిస్తూ ఆర్థికంగా, అధికార పరంగా, రాజకీయంగా లాభాలు పొందుతున్నారన్నది అందరూ గమనించాలని కోరారు.
అత్యంత గొప్పదైన భారతీయ సంస్కృతి, దేవతలు, హిందూ మతం, దేశం మీద ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు, ఏ కులానికి, ఏ మతానికి చెందినవారు చేసినా , ఇటు సమాజం బుద్ది చెప్పాలని, అలాంటి వ్యాఖ్యలు చేసిన వారికి చట్టం యావజ్జీవం లేక ఉరి శిక్ష విధించాలని కోరారు. అవసరమైతే ప్రభుత్వం చట్టాల్ని సవరించాలని, ఆ వ్యాఖ్యల్ని సమర్థించేవారికి కూడా అదే స్థాయిలో గుణపాఠం నేర్పాలని కోరారు. దేశద్రోహం, సంఘ విద్రోహ కుట్రల మీద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలతోపాటు కేంద్రంలో అధికారపార్టీ బీజేపీ చట్టపరంగా అన్ని చర్యలూ తీసుకోవాలని సూచించారు.
రావణ్లు, ప్రకాశ్ రాజ్లు ఎక్కడినుంచి పుట్టుకు వస్తున్నారు?
వీరికి మద్దతు ఇస్తున్నది ఎవరు?
వీరు ఏ సంస్కృతికి వారసులు?
వీరి తండ్రులు, తాతలు ఎవరు? వీరి మూలాలు ఎక్కడున్నాయి?
తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి.
హిందూ సోదరులు, నిజమైన భారతీయ దేశభక్తి భావాలు కలిగిన వారు…— Vijayasai Reddy V (@VSReddy_MP) July 8, 2026