అమరావతి : ఒంగోలు మాజీ పార్లమెంట్ సభ్యురాలు(Former MP) , కావలి మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ (Parvathamma) అనారోగ్యంతో మృతి చెందారు. చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆమె బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి. ఇటీవల వీరి కుమారుడు అనారోగ్యంతో మృతి చెందడంతో తల్లి పార్వతమ్మ కుంగిపోయారు.
మూడు రోజుల క్రితం ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను చెన్నై ఆసుపత్రి(Chennai Hospital) లో చేర్పించారు. పార్వతమ్మ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపాన్ని తెలిపారు. పార్వతమ్మ ఎంపీగా , ఎమ్మెల్యేగా విశేష సేవలందించారని కొనియాడారు. ఒంగోలు, నెల్లూ జిల్లాల రాజకీయాల్లో మాగుంట కుటుంబానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్నారు. దశాబ్దాలుగా ప్రజల అభ్యున్నతికి పాటుపడుతూ స్థానిక ప్రజలతో మాగుంట కుటుంబానికి విడదీయలేని అనుబంధం ఉందన్నారు. 1996లో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా, 2012లో కావలి ఎమ్మెల్యేగా పోటి చేసి గెలుపొందారు.