అమరావతి: ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ, జనసేన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉంగా 118 స్థానాలకు టీడీపీ 94, జనసేన 24 స్థానాల్లో పొత్తులు ఖరారు చేసుకున్నారు. వీటిలో తొలి విడతలో 94 మంది పేర్లను టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించగా, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ 24 స్థానాలకు గాను 5 స్థానాల్లో అభ్యర్థుల పేర్లను ఖరారు చేసి శనివారం జాబితాను విడుదల చేశారు.
First list of TDP-JSP candidates was announced today by Sri @ncbn and @PawanKalyan
#TDPJSPWinning #TDPJSPTogether #TDPJSPAlliance #AndhraPradesh pic.twitter.com/JCoWvy2fDI
— Telugu Desam Party (@JaiTDP) February 24, 2024
జనసేన అభ్యర్థులుగా తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ, నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ, కాకినాడ రూరల్నుంచి పంతం నానాజీ పేర్లను డిక్లేర్ చేశారు.