అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి ( Tirupati ) జిల్లాలో పూతలపట్టు- నాయుడుపేట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం ( Road Accident ) జరిగింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు చనిపోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి జిల్లా పాకాల మండలం తోటపల్లి వద్ద కంటైనర్ వాహనం కిందకు కారు దూసుకెళ్లడంతో కారులో ఉన్న ప్రయాణికులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో వారిని పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.