Road Accident | కర్ణాటక జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బుధవారం వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏపీకి చెందిన విద్యార్థులతో పాటు నలుగురు దుర్మరణం చెందారు. మృతులను మంత్రాలయం వేదపాఠశాలకు చెందిన వారిగా గుర్తించారు. విద్యార్థులు వాహనంలో కర్ణాటక హంపీ క్షేత్రంలోని నరహరి తీర్థుల ఆరాధన కోసం తుఫాను వాహనంలో బయలుదేరి వెళ్లారు. మంత్రాలయం నుంచి మంగళవారం రాత్రి బయలుదేరి వెళ్లగా.. వాహనం సింధనూరు వద్ద ప్రమాదానికి గురైంది.
ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 14 మంది విద్యార్థులు ఉన్నారు. ఘటనలో వాహనం డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు విద్యార్థులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్ర గాయాలకు గురయ్యారు. ఈ ఘటన మంత్రాలయంలో విషాదం నిలిపింది. మృతుల్లో డ్రైవర్ శివ, విద్యార్థులు అభిలాష, హైవదన, సుజేంద్ర, ఉన్నారు. వాహనం అదుపు తప్పి బోల్తాపడినట్లు సమాచారం. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.