అమరావతి : కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. జిల్లాలోని తుని మండలం వెలమకొత్తూరు వద్ద లారీ, బొలెరో వాహనం ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖ నుంచి శ్రీరంగపట్నం వెళ్తున్న బొలెరో వాహనం ఆగిఉన్న లారీని ఢీ కొట్టడంతో బొలెరో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా తుని ప్రాంతీయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. ఈ ఘటనలో మరో 10 మందికి గాయాలయ్యాయి. బాధితులు శ్రీరంగపట్నం వాసులుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.