అమరావతి : ఏపీలోని పశ్చిమ గోదావరి ( West Godavari ) జిల్లా యలమంచిలి మండం చించినాడ బ్రిడ్జి వద్ద కుటుంబం ఆత్మహత్యాయత్నానికి ( Family suicide attempt ) పాల్పడింది. వీరిలో ఒకరిని మత్స్యకారులు కాపాడి ఆస్పత్రికి తరలించారు. తణుకుకు చెందిన నంబూరు శ్రీనివాస్, పద్మిని దంపతులు. వీరికి 16 ఏళ్ల కుమారుడు, 12 ఏళ్ల కుమార్తె ఉన్నారు.
గత 20 ఏళ్లుగా తణుకులో ఉంటున్న కుటుంబం స్థానికంగా కిరాణా, పాల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వ్యాపారం నామమాత్రంగా సాగుతుండడంతో అప్పుల బాధ పెరిగి శనివారం నలుగురు గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. వీరిలో పద్మినిని స్థానికులు రక్షించగా అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మిగతా ముగ్గురు గల్లంతయ్యారు.