నంద్యాల : తాను పోలీసునంటూ పలువురి మోసం చేస్తున్న నకిలీ ఆర్ఎస్ఐని(Fake RSI ) శ్రీశైలం పోలీసులు అరెస్టు(Arrest) చేశారు. మహబూబాబాద్ జిల్లా వినుగుర్తి మండలం, చెట్ల పుప్పారం గ్రామానికి చెందిన కుసుమ ప్రశాంత్(29) అనే యువకుడు తాను సైబరాబాద్ కమిషనరేట్లో ఆర్ఎస్ఐగా పనిచేస్తున్నానంటూ శ్రీశైలం టోల్గేట్ సిబ్బందికి నకిలీ ఐడీ కార్డు చూపించాడు. అనంతరం శ్రీశైలం ఆలయంలో ప్రోటోకాల్ దర్శనం, పోలీస్ గెస్ట్ హౌస్లో రూం కూడా పొందాడు.
గమనించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నకలీ ఆర్ఎస్ఐగా తేలిందని స్టేషన్ ఎస్హెచ్వో తెలిపారు. అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. కాగా నిందితుడు ఘట్కేసర్ పీఎస్ పరిధిలో ఆర్ఎస్ఐనని ఒక బాధితుడు నుంచి రూ. 40 వేలు ఫోన్ పే కాజేయడంతో అతడిపై కేసు నమోదు అయ్యిందని వివరించారు.