అమరావతి : ప్రకాశం జిల్లాలో వెనుకబడిన మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలంటూ మాజీ సైనికులు ఈరోజు ర్యాలీ నిర్వహించారు. మార్కాపురం గడియారం స్తంభం నుంచి కోర్టు కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఒంగోలు వద్దు మార్కాపురం ముద్దు అంటూ నినాదాలు చేశారు.
పల్నాడు జిల్లాకు గురజాల కేంద్రంగా ఉంచాలని కోరుతూ జిల్లా సాధన సమితి పిడుగురాళ్లలో మహా ర్యాలీ నిర్వహించింది . ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోవాలని టీడీపీ నాయకుడు వై. శ్రీనివాస్‌రావు డిమాండ్ చేశారు.