AP News | మాజీ మంత్రి పెద్దారెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు జీఎస్ సెంథిల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వైసీపీ హయాంలో గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ( రెస్కో) చైర్మన్‌గా ఉన్న సమయంలో నిధులను గోల్మాల్ చేశారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులో సెంథిల్‌కుమార్‌ను అరెస్టు చేసి.. కుప్పం పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం.
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెస్కోలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టింది. రెస్కోలో నిధుల గోల్మాల్ వ్యవహారంపై ఆ సంస్థ ఎండీ సోమశేఖర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే రెస్కో మాజీ చైర్మన్ సెంథిల్‌కుమార్‌తో పాటు మాజీ ఎండీ సుబ్రహ్మణ్యం, రెస్కో ఉద్యోగి మురుగేశ్పై కుప్పం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే సెంథిల్‌ను అరెస్టు చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబుపై గతంలో సెంథిల్ చేసిన కామెంట్లు పెద్ద దుమారం రేపాయి. 2021 అక్టోబర్‌లో చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ చేపట్టిన జనాగ్రహ దీక్షలో పాల్గొన్న సెంథిల్.. చంద్రబాబు కాన్వాయ్‌పై బాంబు వేస్తానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.