తిరుమల : టీటీడీ (TTD ) ఈవో శ్యామలరావు టీటీడీ ఎక్స్అఫీసియో సభ్యుడిగా( Ex-officio member ) ఆదివారం ప్రమాణం చేశారు. తిరుమలలోని (Tirumala) బంగారు వాకిలి వద్ద అదనపు ఈవో ప్రమాణం ఆయనతో స్వీకారం చేయించారు. అనంతరం ఈవోకు స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.
ఈవో మాట్లాడుతూ ఎక్స్అఫీసియో సభ్యుడిగా అవకాశమిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. గడిచిన ఐదునెలల్లో టీటీడీలో అనేక మార్పులు చేశామని వివరించారు. అన్నప్రసాదాలు, ఐటీ విభాగాల్లో మార్పులకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఇటీవల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించామని చెప్పారు. కొత్త పాలకమండలిలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని వెల్లడించారు.