టీటీడీ ఫొటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఈవో
Photo exhibition| నెల్లూరులోని శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాల్లో టీటీడీ ప్రజా సంబంధాల విభాగం ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను
అమరావతి : నెల్లూరులోని శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాల్లో టీటీడీ ప్రజా సంబంధాల విభాగం ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను టీటీడీఈవో ఎవి.ధర్మారెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు పబ్లికేషన్ స్టాల్, పంచగవ్య ఉత్పత్తుల స్టాళ్లను, గోపూజ జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఫొటో ఎగ్జిబిషన్లో గోవు మహత్యం, గోపూజ విశిష్టత, సప్తగోప్రదక్షిణశాల, గోసంరక్షణశాలలో దేశవాళీ ఆవుల పెంపకంపై ప్రదర్శించిన ఫొటోలను పరిశీలించారు.
గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులతో శ్రీవారికి నైవేద్యం, గత ఐదు దశాబ్దాల్లో శ్రీవారి దర్శనానికి పెరుగుతున్న భక్తుల సంఖ్య, శ్రీవారి సేవ, నవనీత సేవ, విద్యుత్ కార్లు, లడ్డూ ప్రసాదం, పవిత్ర ఉద్యానవనాలు, అగరబత్తు ల తయారీ, పంచగవ్య ఉత్పత్తుల తయారీ, శ్రీవారి పుష్ప ప్రసాదం ఫొటో ఫ్రేమ్స్ తదితరాల ఫ్లెక్సీలు పరిశీ లించారు . శ్రీవారి వైభవాన్ని తెలిపేలా ముద్రించిన ఆధ్యాత్మిక పుస్తకాలను టీటీడీ పుస్తక విక్రయశాలలో అందుబాటులో ఉంచారు.
‘నమామి గోవింద’ పేరుతో విడుదల చేసిన పంచగవ్య ఉత్పత్తులు, డ్రైఫ్లవర్ టెక్నాలజీతో తయారు చేసిన ఫొటో ఫ్రేమ్స్ భక్తులకు విక్రయించేందుకు అందుబాటులో ఉంచారు. అనంతరం నమూనా ఆలయంలో నిర్వహించిన శ్రీవారి సహస్రదీపాలంకరణ సేవలో ఈవో పాల్గొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bengaluru Techie’s Kidnap | టెక్కీ కిడ్నాప్ కేసులో 11 మంది అరెస్ట్.. అతడు అత్యాచారానికి పాల్పడినట్లు కిడ్నాపర్ మహిళ ఫిర్యాదు
Tirumala | తిరుమలలో నీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు.. 150 రోజులకు సరిపడా నీటి నిల్వలు : టీటీడీ
Water Tanker | హైదరాబాద్ రోడ్లపై.. వాటర్ ట్యాంకర్లో నుంచి వృధాగా పోతున్న నీళ్లు.. వీడియో
Case Register | రైస్‌మిల్‌లో రూ.13.77 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం.. మిల్లు భాగస్వాములపై కేసు నమోదు
Premayanam | ఓటీటీలో అదరగొడుతున్న ‘ప్రేమాయణం’ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

