AP News | హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): తాను విదేశాల్లో ఉండగా తన భార్య, ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి గర్భం దాల్చిందని ఆమె భర్త మదన్మోహన్ ఆ శాఖ కమిషనర్ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు.
తన భార్య అక్రమ సంతానానికి తండ్రెవరో తేల్చాలని కోరుతూ కమిషనర్‌కు లేఖ రాశారు. ఆమె గర్భానికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, గవర్నమెంట్ ప్లీడర్ సుభాష్ కారణమనే అనుమానం వ్యక్తం చేశా రు. కాగా ఇటీవలే ఏసీ శాంతిని దేవాదాయశాఖ కమిషనర్ సస్పెండ్ చేశారు.