అమరావతి : ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు (Eluru Medical College) ప్రముఖ శాస్త్రవేత్త ఎల్లాప్రగడ సుబ్బారావు (Ellapragada Subbarao) పేరు ఖరారు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య విభాగంలో కీలకమైన ఆవిష్కరణలు చేసిన ఎల్లాప్రగడ స్వస్థలం భీమవరం (Bhimavaram). ఇటీవల ఏదైనా ప్రభుత్వ వైద్య కళాశాలకు ఎల్లాప్రగడ సుబ్బారావు పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandra Babu) వైద్య అధికారులను ఆదేశించారు.
ఈ మేరకు అధికారులు ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు ఆయన పేరు పెడుతూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చంద్రబాబుకు ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. క్యాన్సర్ చికిత్సలో కీమోథెరపీకి వాడే తొలితరం డ్రగ్‌ను ఎల్లాప్రగడ అభివృద్ధి చేశారు. తొలి టెట్రాసైక్లిన్ యాంటీ బయోటిక్ ‘అరియోమైసిన్’ను సుబ్బారావు కనుగొన్నారు. క్షయ,బోద వ్యాధుల నివారణకు పలు ఔషదాలు తయారు చేసిన ఘనతను సాధించుకున్నారు.