అమరావతి : ఏపీ రాజధాని అమరావతిలో 2027లో నేషనల్ గేమ్స్ (National Games) నిర్వహణలకు కృషి చేస్తామని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని (MP Keshineni Chinni) పేర్కొన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా విజయవాడంలో వాకర్ అసోసియేషన్ సభ్యులు కేశినేనిని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళగిరిలో క్రికెట్ స్టేడియాన్ని (Cricket Stadium) ఆరు నెలల్లో ప్రారంభిస్తామని, విజయవాడలో క్రికెట్ అకాడమీ (Criket Acadamy) స్థాపనకు కృష్టి చేస్తానని వెల్లడించారు. ఏపీ అభివృద్ధితో పాటు , అమరావతి, విజయవాడ అభివృద్ధికి పాడుపడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.