Janga Krishnamurthy | ఏపీకి చెందిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి స్పీకర్ షాక్ తగిలింది. ఆయనపై అనర్హత వేటు వేస్తూ మండలి చైర్మన్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇటీవల ఆయన అధికార వైఎస్సార్సీపీని వదిలి తెలుగుదేశం పార్టీలో చేరారు. దీంతో వైఎస్సార్సీపీకి చెందిన పలువురు సభ్యులుపై ఆయనపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని విప్ అప్పిరెడ్డి విప్ లేళ్ల అప్పిరెడ్డి అసెంబ్లీ సెక్రెటరరీ జనరల్‌కు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు మేరకు మండలి చైర్మన్ మోషేనురాజు పార్టీ ఫిర్యాంపులకు పాల్పడ్డ కృష్ణమూర్తి నుంచి వివరణ సైతం తీసుకున్నారు.
తాజాగా ఎమ్మెల్సీగా కృష్ణమూర్తి అనర్హుడని పేర్కొంటూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇదిలా ఉండగా.. జంగా కృష్ణమూర్తి 2009 నుంచి 2019 మధ్య పల్నాడు జిల్లా గురజాల ఎమ్మెల్యేగా పని చేశారు. ఆ తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆయనను ఎమ్మెల్సీగా చేసింది. జగన్ ప్రభుత్వంలో ఆయన విప్‌గానూ పని చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీని వదిలి తెలుగుదేశం పార్టీలో చేరారు. జంగా కృష్ణమూర్తి ఏప్రిల్ 1న వైఎస్సార్సీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఏపీ బీసీ సెల్ అధ్యక్ష పదవి నుంచి సైతం తప్పుకున్నారు. అదే నెల 6న సత్తెనపల్లిలో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం తీర్థం స్వీకరించారు.