అమరావతి : ఎమ్మెల్సీగా అనర్హత వేటు కక్షపూరిత చర్య అని టీడీపీ నాయకుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి (MLC Janga Krishnamurthy) అన్నారు. మౌఖికంగా తన వివరణ తీసుకోకుండానే అనర్హత వేటు వేశారని దుయ్యబట్టారు. వెనుకబడిన వర్గాలపై తీసుకున్న చర్యగా భావిస్తున్నానని ఆరోపించారు. ఎమ్మెల్సీ(MLC) పదవి నాకు వ్యక్తిగతంగా ఇచ్చింది కాదు. నా బీసీ వర్గాలకు ఇచ్చిందని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు మండలి చైర్మన్‌పై ఒత్తిడి తెచ్చి వేటు వేయించారని వెల్లడించారు.
వంశీ (Vamsi), మద్దాలి గిరి(Maddali Giri)పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం బీసీ నాయకత్వాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. బీసీలను వాడుకొని వదిలేయడం వారికి అలవాటని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై గురువారం అనర్హత వేటు వేస్తూ మండలి చైర్మన్ (Council Chairman) గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇటీవల ఆయన అధికార వైఎస్సార్సీపీని వదిలి టీడీపీ (TDP)లో చేరారు. ఈ మేరకు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద జంగారెడ్డిపై అనర్హత వేటు వేయాలని విప్ లేళ్ల అప్పిరెడ్డి అసెంబ్లీ సెక్రెటరరీ జనరల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మండలి చైర్మన్ మోషేనురాజు కృష్ణమూర్తిపై చర్య తీసుకున్నారు.