మాజీ ఎంపీ లగడపాటి పై కేసు కొట్టివేత
Case dismissal|విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పై ఎన్నికల కమిషన్ నమోదు చేసిన కేసును విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఇవాళ కొట్టివేసింది.
అమరావతి : విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పై ఎన్నికల కమిషన్ నమోదు చేసిన కేసును విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఇవాళ కొట్టివేసింది. 2014 ఎన్నికలకు సంబంధించిన ఫలితాల వెల్లడికి ముందే అంచనాలను ప్రకటించడాన్ని అప్పటి ఎన్నికల సంఘం కమిషనర్ లగడపాటిపై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆరుగురు సాక్షులను కోర్టు పలు దఫాలుగా విచారించిడంతో పాటు ఆడియో,వీడియో రికార్డింగ్లను న్యాయస్థానం పరిశీలించింది.
అయితే సరైన ఆధారాలు లేకపోవడంతో కేసును కొట్టివేస్తున్నట్లు ప్రజాప్రతినిధుల కోర్టు ప్రకటించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత రాజకీయాలకు దూరంగా ఉన్న లగడపాటి 2019లో సర్వేల పేరిట హంగామా సృష్టించాడు .
తన సంస్థ చేపడుతున్న ఎన్నికల ఫలితాలు కచ్ఛితత్వంతో కూడుకున్నవని తెలిపారు. సర్వే ఫలితాలు పూర్తిగా భిన్నంగా రావడంతో ముందుగానే ఆయన ప్రకటించిన విధంగా రాజకీయాల నుంచి దూరంగా ఉంటున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

